COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y200 Price: ప్రస్తుతం చాలా మంది ప్రీమియం కెమెరాతో కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువత కెమెరాతో పాటు అతి తక్కువ ధరలో లభించేవాటిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ Vivo ఇటీవలే ఓ ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్‌ అతి చౌకగా లభించడమే కాకుండా శక్తివంతమైన కెమెరాతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ ఏంటో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రముఖ టెక్‌ కంపెనీ Vivo ఇటీవలే Vivo Y200 5G మోడల్‌తో విడుదల చేసిన మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.27,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 21 శాతం తగ్గింపుతో కేవలం రూ. 21,887కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం ఈ Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Vivo Y200 5G బెస్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెక్స్:
Vivo Y200 5G స్మార్ట్ ఫోన్స్‌ స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు ఇది  Android 13తో వస్తోంది. అలాగే ఈ మొబైల్‌ 64 మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా సెన్సార్ లెన్స్‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 


Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ:
Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన బ్యాటరీతో లభిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ ఆప్షన్‌. ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో 4800mAh బ్యాటరీతో లభిస్తోంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter