Vivo Y200 Pro Price: ప్రముఖ టెక్‌ కంపెనీ వీవో తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి  Vivo Y200 Pro 5G మొబైల్‌ను విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 3D కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ 8 GB ర్యామ్‌,  128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ ఈ స్టోర్‌తో పాటు వివిధ రకాల ఈ కామర్స్‌ కంపెనీల్లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా HDFC, ICICI లేదా SBI కార్డ్ ద్వారా బిల్‌ చెల్లించి కొనుగోలు చేసేవారికి రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది మే 31 వరకు కొనసాగుతుంది. 


Vivo Y200 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో లభిస్తోంది. అలాగే ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ర్యామ్‌, ఇంటర్నల్ స్టోరేజ్‌ను పెంచుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌  స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 


ఇతర ఫీచర్స్‌:
డబుల్‌ కెమెరా సెటప్‌ 
64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
2-మెగాపిక్సెల్ బోకె లెన్స్ కెమెరా


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే
 16-మెగాపిక్సెల్ OIS సెటప్‌తో సెల్ఫీ కెమెరా 
6000mAh బ్యాటరీ
44 వాట్ల ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 14 ఆధారంగా Funtouch OS 14
బయోమెట్రిక్ సెటప్‌
IP54 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌
డ్యూయల్ సిమ్
5 జి, వై-ఫై, బ్లూటూత్ 5.1
యుఎస్‌బి టైప్-సి, జిపిఎస్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి