What is Jio AirFiber: న్యూఢిల్లీ: ఈ సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని చిట్టచివరి మారుమూల ప్రాంతాల వరకు జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ స్పష్టంచేశారు. ఆగస్టు 28న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ఈ ప్రకటన చేశారు. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుండి తప్పుకుంటూ తమ వారసులు ఇషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్‌ అంబానీలను కొత్త నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌గా అపాయింట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో ఫైబర్ కి జియో ఎయిర్ ఫైబర్ కి తేడా ఏంటి ?
జియో ఎయిర్ ఫైబర్ అనే పేరు వినడంతోనే చాలామందిలో ఓ సందేహం మొదలైంది. ఫైబర్ నెట్ వర్క్ అంటేనే ఆప్టికల్ ఫైబర్ వైర్లతో కూడిన నెట్ వర్క్ కదా.. మరి ఈ ఎయిర్ ఫైబర్ ఏంటి అని. అంతేకాకుండా ఇప్పటికే జియో ఫైబర్ ఉంది కదా.. మళ్లీ కొత్తగా ఈ జియో ఎయిర్ ఫైబర్ ఏంటా అని ఆలోచనలో పడ్డారు. అయితే, ఈ రెండింటి మధ్య తేడా ఉంది. జియో ఫైబర్ అనేది ఆప్టికల్-ఫైబర్‌ కేబుల్ ద్వారా హై స్పీడ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్  అందించే నెట్ వర్క్ కాగా.. కొత్తగా ప్రకటించిన జియో ఎయిర్‌ఫైబర్‌కి ఫిజికల్ వైరింగ్ అవసరం లేదు. ఇది రూటర్స్, యాంటెన్నాల ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తుంది.


జియో ఎయిర్ ఫైబర్ ఎలా పనిచేస్తుందంటే ..
జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. వినియోగదారులు రూటర్, యాంటెన్నా, సెటప్ బాక్సులు ఉపయోగించాల్సి ఉంటుంది. గిగాబైట్ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ కనెక్షన్ అందించే సత్తా జియో ఎయిర్ ఫైబర్ సొంతం అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. జియో ఫైబర్ వెళ్లలేని చోటుకు సైతం జియో ఎయిర్ ఫైబర్ వెళ్లేలా చేయాలి అనే లక్ష్యంతోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆలోచనను ఆచరణలో పెడుతోంది అని స్పష్టంగా అర్థం అవుతోంది.


ఇది కూడా చదవండి : Ola S1 X Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 2 వారాల్లోనే 75 వేల బుకింగ్స్


జియో ఎయిర్ ఫైబర్ ఎంత ధర ఉంటుంది ?
ప్రస్తుతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఎయిర్ ఫైబర్ లాంచింగ్ తేదీని మాత్రమే ప్రకటించింది. అంతకు మించి వేరే ఇతర సమాచారాన్ని వెల్లడించలేదు. కాకపోతే.. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సహా జియో నుండి లభించే అనేక ఇతర మొబైల్ యాప్స్‌కి కూడా యాక్సిస్ అందిస్తుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి : 
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి