Whatsapp Video Call Limit: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మరో సరికొత్త అప్‌డేట్‌తో మీ ముందుకు వచ్చింది. వీడియో కాలింగ్‌కు సంబంధించి కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ కింద విండోస్ లేదా డెస్క్‌టాప్‌ వినియోగదారులు 32 మందితో ఒకేసారి ఆడియో, వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాట్సాప్ డెస్క్‌టాప్ వర్షన్‌లో 8 మందికి గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు  వీడియో కాల్ లిమిట్‌ను పెంచింది. ఆడియో కాల్‌ లిమిట్ గతంలోనే 32 వరకు ఉండేది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకేసారి 32 మందికి వీడియో కాల్స్ చేసే సౌకర్యం ప్రస్తుతం బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు బీటా అప్‌డేట్ 2.23.24.1.0ని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్‌లు గ్రూప్ కాలింగ్‌ని ట్రై చేయమని ఆహ్వానిస్తూ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఈ మెసేజ్ 32 మందికి వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం గురించి ఉంటుంది. 


అయితే కొంతమంది వినియోగదారులకు 16 మందికి వీడియో కాల్ సపోర్ట్ చేస్తూ..  ప్రత్యామ్నాయ సందేశం స్వీకరించి ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విండోస్ 2.2322.1.0 అప్‌డేట్ కోసం గతంలో వాట్సాప్ బీటా వెర్షన్ కోసం అందుబాటులో ఉన్న వీడియో కాల్‌ల సమయంలో స్క్రీన్‌షాట్‌లను తీయడానికి.. షేర్ చేసుకునే సదుపాయం తాజా అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుంది.   


వాట్సాప్ 'మెసేజ్ పిన్ డ్యూరేషన్' అనే కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్ వినియోగదారులు వారి సంభాషణల సమయంలో పిన్ చేసిన సందేశాలను యాక్టివ్‌గా ఉంచడానికి టైమ్ లిమిట్‌ను కూడవా సెట్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులను టైమ్ లిమిట్‌ను ఎంచుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత పిన్ చేసిన మెసేజ్ సెట్ చేసిన టైమ్‌లో ఆటోమెటిక్‌గా అన్‌పిన్ అవుతుంది. వినియోగదారులు వారి ఆప్షన్ ప్రకారం 24 గంటలు.. 7 రోజులు లేదా 30 రోజుల పాటు చాట్‌ను పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టైమ్ ముగిసేలోపు వినియోగదారులు ఎప్పుడైనా పిన్ చేసిన మెసేజ్‌ను ఎప్పుడైనా అన్‌పిన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.


Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన  


Also Read: Nagarjuna New Car: కొత్త కారు కొనుగోలు చేసిన నాగార్జున.. ధర ఎంతో తెలుసా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి