Xiaomi Civi 4 Pro: ప్రపంచంలో మొదటిసారిగా రెండు సెల్ఫీ కెమేరాలతో షియోమీ ఫోన్ లాంచ్, ధర ఎంతంటే
Xiaomi Civi 4 Pro: మార్కెట్లో చాలా రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సాధారణంగా డ్యూయల్ లేదా త్రిబుల్ కెమేరా సెటప్ చూస్తుంటాం. అయితే ఇవి బ్యాక్ కెమేరాకే పరిమితం. మొదటిసారిగా ఇప్పుడు డ్యూ.యల్ ఫ్రంట్ కెమేరాతో ఫోన్ లాంచ్ అయింది.
Xiaomi Civi 4 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ జోడించుకుని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు తొలిసారిగా డ్యూయల్ ఫ్రంట్ కెమేరా లాంచ్ చేసింది. అంటే రెండు సెల్ఫీ కెమేరాలుంటాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Xiaomi రెండ్రోజుల క్రితం అంటే మార్చ్ 21న Xiaomi Civi 4 Pro ఫోన్ చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో మొదటిసారిగా అందుబాటులో రానున్న టెక్నాలజీలు ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ మొదటిసారి వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, సాఫ్ట్ మిస్ట్ పింక్, స్ప్రింగ్ వైల్డ్ గ్రీన్, స్టార్రీ బ్లాక్ రంగుల్లో లభించనుంది. అంతేకాకుండా లిమిటెడ్ ఎడిషన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. బ్లాక్ అండ్ బ్లూ, బ్లూ అండ్ పింక్, బ్లాక్ అండ్ వైట్. ఈ మూడు కలర్ కాంబినేషన్లు చాలా ట్రెండీగా ఉండవచ్చు. కొన్ని వేరియంట్లకు వెనుకవైపు ప్యానెల్ హాఫ్ గ్లాస్ హాఫ్ లెదర్ ఉంటుంది.
Xiaomi Civi 4 Pro 6.55 ఇంచెస్ 1.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 3000 బిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఈ ఫోన్ క్లారిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసి చిప్‌సెట్ ప్రాసెసర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే. 16 జీబి వరకూ ర్యామ్ ఉండటంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఇక ఇందులో లైకా ట్రిపుల్ రేర్ కెమేరా, లైకా ఆప్టిక్స్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో పాటు మరో 50 మెగాపిక్సెల్ 50ఎంఎం ప్రొఫెషనల్స్, పోర్ట్రెయిట్ ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. అన్నింటికీ మించి మొదటిసారిగా రెండు సెల్ఫీ కెమేరాలు ఉంటాయి. రెండు సెల్ఫీ కెమేరాలు 32 మెగాపిక్సెల్ కావడం విశేషం.
ఈ ఫోన్ బ్యాటరీ 4700 ఎంఏహెచ్ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇక Xiaomi Civi 4 Pro ధర 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే భారతీయ కరెన్సీ ప్రకారం 34,600 రూపాయలుగా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 38,299 రూపాయలుంటుంది. అదే 16 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 41,500 రూపాయలుంటుంది. మార్చ్ 21న చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్ నడుస్తోంది. మార్చ్ 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా తెలియలేదు.
Also read: Motorola Edge 50 Pro: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో మోటోరోలా కొత్త ఫోన్, లాంచ్ తేదీ ఇతర ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook