Xiaomi NoteBook Pro Laptops: షియోమీ నుంచి కొత్త నోట్‌బుక్ ప్రో 120 జి ల్యాప్‌టాప్ విడుదలైంది. ప్రీమియం డిజైన్‌తో లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్‌లో మ్యాక్‌బుక్ ప్రత్యేకతలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీ లైనప్‌ను మరింతగా విస్తృతం చేస్తూ షియోమీ ఇప్పుడు కొత్తగా రెండు ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. ఒకటి ల్యాప్‌టాప్. అద్భతమైన రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. Xiaomi NoteBook Pro 120G లేటెస్ట్ మోడల్ ఇది. గేమర్స్‌ను దృష్టిలో ఉంచుకుని 120 హెర్ట్జ్ స్క్రీన్‌తో విడుదల చేసింది. ఇవి కాకుండా..ఇందులో ఒక ప్రత్యేక గ్రాఫిక్ కార్డు ఉంది.


కొత్త షియోమీ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ ప్రత్యేకతలు కలిగి ఉంది. మ్యాక్‌బుల్‌లా..అల్యూమినియం మిశ్రమ ధాతువుతో ప్రీమియం డిజైన్‌లో రూపుదిద్దుకుంది. రెండు ల్యాప్‌టాప్‌లు చాలా స్లీక్‌గా ఉంటాయి. అంటే ఇందులో ఎక్కువ విడిభాగాలుండవు. ఇందులో యూఎస్‌బీ సీ పోర్ట్, యూఎస్బీ ఏ పోర్ట్ హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్, థండర్ బోల్ట్ 4 పోర్ట్ ఉంటాయి. షియోమి నోట్‌బుక్ ప్రో 120 హెర్ట్జ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కాగలదు. 


Xiaomi NoteBook Pro 120G, NoteBook Pro 120 ఇండియా ధరలు


షియోమి నోట్‌బుక్ ప్రో 120జి ప్రీమియం మోడల్ ల్యాప్‌టాప్, దీని ధర 74,999 రూపాయలుగా ఉంది. ఇది సింగిల్ సిల్వర్ రంగులో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 20 నుంచి షియోమీ వెబ్‌సైట్ , అమెజాన్‌లో విక్రయాలు జరగనున్నాయి. షియోమి నోట్‌బుక్ ప్రో 120 జిలో జీపీయూ ఉండదు. దీని ధర 69,999 రూపాయలుగా ఉంది.. 


గేమర్స్ కోసం Xiaomi NoteBook Pro 120G మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఇందులో వర్క్ ఫ్రం హోం చేసేవారికి చాలా సౌకర్యాలున్నాయి. గేమింగ్‌ను మరింత అద్భుతంగా మార్చేందుకు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, Nvidia గ్రాఫిక్ కార్డ్ అమర్చారు. నోట్‌బుక్ ప్రో 120 హెర్ట్జ్‌లో 14 ఇంచెస్ 2.5 కే డిస్‌ప్లే ఉంది. మల్టీ కలర్స్ కోసం ఎంఐ ట్రూ లైఫ్ సాంకేతికతను వినియోగించారు. డిస్‌ప్లే 100 శాతం sRGB కలర్, డీసీ డిమింగ్, బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉన్నాయని షియోమీ వెల్లడించింది. 


షియోమీ నోట్‌బుక్ ప్రో 120 హెర్ట్జ్‌లో 8 కోర్, 12 త్రెడ్స్‌తో 12 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 Alder Lake H45 ప్రోసెసర్ ఉంది. 


Also read: UPI Payment Limit: యూపీఐ చెల్లింపులు రోజుకు ఎంత ఉండాలి, పరిమితి ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook