COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zebronics Juke Bar 9750 Pro: దీపావళి పండగ సందర్భంగా అన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో ప్రత్యేక సేల్స్‌ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ సేల్స్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ వస్తువులు, దుస్తువులపై స్పెషల్‌ డీల్స్‌ నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక డీల్స్‌లో భాగంగా మల్టీ నేషనల్‌ బ్రాండ్‌లకు సంబంధించిన సౌండ్‌ బార్స్‌ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పండగ సేల్‌ ఏయే సౌండ్‌ బార్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


దీపావళి ప్రత్యేక డీల్‌లో భాగంగా జెబ్-జూక్ బార్ 9550 ప్రో డాల్బీ 5.2 సౌండ్‌బార్ (Zebronics Juke bar 9550 Pro Dolby 5.2) సౌండ్‌ బార్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ సౌండ్‌ బార్‌ డ్యూయల్ వైర్‌లెస్ సబ్‌ వూఫర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా  డ్యూయల్ శాటిలైట్ స్పీకర్‌లతో 625W పవర్‌ అవుట్‌పుట్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఈ సౌండ్‌ బార్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 


జెబ్-జూక్ బార్ 9550 ప్రో డాల్బీ 5.2 సౌండ్‌బార్‌ మొత్తం మూడు భాగాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సౌండ్‌బార్‌లు 75W డ్రైవర్‌లతో కూడిన ఆకర్శనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో రెండు వైర్‌లెస్ సబ్‌ వూఫర్‌లు సౌండ్‌కి మంచి బేస్‌ను అందిస్తాయి.  ఒక్కొక్కటి 75W అవుట్‌పుట్‌తో మొత్తం 625W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుందని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. నాణ్యమైన ఆడియో కోసం డాల్బీ ఆడియో ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.    


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ట్రిపుల్-డ్రైవర్ సౌండ్‌బార్, శాటిలైట్ క్రిస్టల్-క్లియర్ ఆడియో క్వాలిటీని అందించడానికి కలిసి పని చేస్తాయని Zebronics అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ బార్స్‌ శక్తివంతమైన సౌండ్ పెర్ఫార్మెన్స్ అందిస్తాయి. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మంచి సౌండ్‌ బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ సౌండ్‌ బార్‌ను ఎంచుకోవచ్చు.


ఇక ఈ ZEB-JUKE BAR 9550 Pro Dolby 5.2 సౌండ్‌ బార్‌ ధర విషయానికొస్తే రూ. 19,999కు కంపెనీ విక్రయిస్తోంది. ఈ సౌండ్‌ బార్‌ విక్రయాలు నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. అయితే దీని అమ్మకాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. 


సౌండ్‌బార్‌ ఫీచర్స్‌:
RGB లైట్లతో స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
5.3 బ్లూటూత్ వెర్షన్ 
HDMI (ARC)
ఆప్టికల్-ఇన్
Aux, USB మోడ్‌లు
625W పవర్‌ అవుట్‌పుట్‌
ఒక్కొక్కటి 75W అవుట్‌పుట్‌
5.2 సరౌండ్‌ సౌండ్‌ 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook