Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషం వరకు నామినేషన్లు వేశారు అభ్యర్థులు. గురువారం వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు వేశారు. అయితే చివరి రోజు మాత్రం భారీగా నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థుగా నామినేషన్ వేశారు. చర్లగూడం రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమ నిరసన తెలిపేందుకు ఉప ఎన్నికను అస్త్రంగా ఎంచుకున్నారు. పదుల సంఖ్యలో నిర్వాసితులు నామినేషన్ వేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో సెంచరీ దాటాయి నామినేషన్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉపసమరానికి సంబంధించి మరో ట్విస్ట్ జరిగింది. ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ప్రజా గాయకుడు గద్దర్.. చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని గతంలో కేఏ పాల్ ప్రకటించారు. కాని ప్రజాశాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్. గద్దర్ నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కేఏ పాల్ ప్రకటన అలా ఉన్నా.. గద్దరే మునుగోడు పోటీ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. దసరా పండుగ రోజున ప్రజాశాంతి పార్టీలో చేరారు గద్దర్. అప్పుడే మునుగోడు నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను ప్రకటించారు కేఏ పాల్. తర్వాత టీజేఎస్ అధినేత కోదండరామ్ ను కలిశారు గద్దర్. దీంతో ప్రజా శాంతి పార్టీ నుంచి కాకుండా టీజేఎస్ అభ్యర్థిగా గద్దర్ బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కాని తమ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ ను ప్రకటించింది టీజేఎస్. దీంతో చివరి రోజును ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ నామినేషన్ వేస్తారని అంతా భావించారు. కాని గద్దర్ నామినేషన్ వేయలేదు.


మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ లను ప్రకటించింది ఏఐసీసీ. ఎన్నికల సంఘానికి జాబితా అందజేసింది. 38 మందికి ఈ జాబితా లో చోటు దక్కింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా తదితరులకు చోటు కల్పించింది.


Read Also: Munugode Bypoll: మునుగోడులో 12 వేల కొత్త ఓటర్లకు అనుమతి.. హైకోర్టు తీర్పుతో ఎవరికి లాభం?


Read Also: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook