School Girl Opens Library: 11 ఏళ్లకే ఎంత పెద్ద మనసో.. ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి
School Girl Opens Library: ఆకర్షణ సతీష్ బాలికల కోసం ఒక ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేయడంతో తన పని అయిపోయింది అని అనుకోలేదు. తన తాతయ్య, బామ్మల నుంచి నిధులు సేకరించి.. వారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అదే బాలికల వసతి గృహంలో మరొక పని కూడా చేశారు. అదేంటంటే..
School Girl Opens Library: వయస్సులో చిన్న పాపే అయినా ఎంతో పెద్దగా ఆలోచించింది ఆ చిన్నారి. బుక్ రీడింగ్ అనే అలవాటు మనిషి ఆలోచనా విధానంలో ఎంతో మార్పు తీసుకొస్తుందని 11 ఏళ్ల ప్రాయంలోనే బలంగా నమ్మిన ఆ చిన్నారి.. మహిళా సాధికారత పుస్తక పఠనంతోనే సాధ్యం అవుతుందనుకుంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటలో దాగి ఉన్న అర్థాన్ని పసిగట్టిన ఆ చిన్నారి.. నేటి బాలికల్లో చైతన్యం నింపేందుకు తన వంతు కృషి చేయాలనుకుంది. పుస్తక పఠనంపై అవగాహన కల్పించి వారిలో విజ్ఞానం పెంచాలని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా తన గొప్ప ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలికల వసతి కమ్ జువెనల్ హోమ్‌ని వేదికగా ఎంచుకుంది. ఆ చిన్నారి పేరు ఆకర్షణ సతీష్.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుకుంటున్న ఆకర్షణ సతీష్.. కాచిగూడ సమీపంలోని నింబోలిఅడ్డలో ఉన్న బాలికల బాలికల వసతి కమ్ జువెనల్ హోమ్‌లో సొంతంగా ఒక ఉచిత లైబ్రరీని ఏర్పాటు చేసింది. అక్కడ ఉంటున్న అమ్మాయిలు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం సంపాదించుకోవచ్చు అనేది ఈ అమ్మాయి ఆలోచన. ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్ అండ్ భరోసా విభాగంలో అడిషనల్ డీజీపీగా సేవలు అందిస్తున్న షికా గోయేల్ చేతుల మీదుగా ఈ లైబ్రరీని ప్రారంభించారు. ఈ లైబ్రరీలో 600 కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలోని బాలికల బాలికల వసతి కమ్ జువెనల్ హోమ్‌లో లైబ్రరీని ఏర్పాటు చేయాలని అనుకున్న ఆకర్షణ సతీష్.. అందుకోసం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ తరువాతే తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. బాలికల వసతి గృహంలో ఆకర్షణ సతీష్ సొంతంగా లైబ్రరి తెరవడాన్ని ప్రశంసిస్తూ జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ విభాగం స్పెషల్ సెక్రటరీ అండ్ కమిషనర్ భారతి హోల్లికెరీ ఓ లేఖ కూడా రాయడం విశేషం.
ఆకర్షణ సతీష్ బాలికల కోసం ఒక ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేయడంతో తన పని అయిపోయింది అని అనుకోలేదు. తన తాతయ్య, బామ్మల నుంచి నిధులు సేకరించి.. వారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అదే బాలికల వసతి గృహంలో బాలికల కోసం శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్‌ని ఏర్పాటు చేసి మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది.
ఇది కూడా చదవండి : Bandi Sanjay's Bail: బండి సంజయ్ బెయిల్ రద్దుపై పోలీసులకు షాకిచ్చిన కోర్టు
చిన్న వయస్సులోనే ఆకర్షణ సతీష్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఆమెని ప్రముఖులచే అభినందనలు అందుకునేలా చేశాయి. ఆకర్షణ సతీశ్ ఇలా ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో సనత్ నగర్ పోలీసు స్టేషన్ ఆరణలో ఒక ఇన్ - హౌజ్ లైబ్రరీలు తెరిచారు. అలాగే ఎంఎన్జే క్యాన్సర్ చిల్డ్రెన్స్ హాస్పిటల్లోనూ ఆకర్షణ సతీష్ మరొక ఇన్ - హౌజ్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఆయా స్థలాలకు వచ్చి వెళ్లే వారికి విజ్ఞానం పంచేందుకు కృషి చేయడం నిజంగా అభినందించదగిన విషయమే అవుతుంది కదూ.
ఇది కూడా చదవండి : Telangana Covid 19 Cases: మళ్లీ విజృభింస్తోన్న కరోనా వైరస్.. తెలంగాణాలో కొత్తగా ఎన్ని కేసులంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK