Hyderabad Jawahar Nagar Rape Incident: హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గిరిజన బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక గర్భం దాల్చగా నిందితుడు ఆమెకు అబార్షన్ చేయించాడు. బాధిత బాలిక తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కి చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె ఇంటి పక్కనుండే రవి (21) అనే యువకుడు కన్నేశాడు. బాలిక తండ్రి మరణించడంతో తల్లి కూలీ నాలీ చేస్తూ ఆమెను పోషిస్తోంది. తల్లి కూలీ పనులకు వెళ్తుండగా బాలిక ఇంటి వద్దే ఉంటోంది. బాలిక ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించిన రవి.. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు.


ఈ క్రమంలో ఓరోజు ఇంట్లోకి చొరబడి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా నిందితుడు పలుమార్లు బాలికపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఇటీవల బాలికకు కడుపు నొప్పి రాగా అతను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలిక వయసు 20 ఏళ్లు అని అబద్దం చెప్పి.. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. 


బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించడంతో బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించాడు. అబార్షన్ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడు. బాధిత బాలిక ఈసారి తన తల్లికి అసలు విషయం చెప్పేసింది. దీంతో తన కూతురిని వెంట పెట్టుకుని వెళ్లి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఇంకా మరవకముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 



Also Read: Actress Aishwarya: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్.. ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటోంది..  


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.