హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ  డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా ఈ ముఠా, 170 మంది వ్యక్తులను, రూ .2.25 కోట్లకు పైగా మోసం చేసింది.ఈ ముఠాకు సంబంధించి ఒక మహిళతో సహా ఆరుగురిని డుండిగల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సిజ్జనార్ తెలిపిన కథనం ప్రకారం, సుందరం కాలనీలో నివసించే బుసారాజు లలిత నుండి దుండిగల్ పోలీసులకు డిసెంబర్ 28 న ఫిర్యాదు అందిందని, 2 బిహెచ్‌కె ఇల్లును రూ .1.6 లక్షలకు కేటాయిస్తామని హామీ ఇచ్చిన 
మోసగాళ్లపై ఆమె పిర్యాదు చేశారని తెలిపారు. 


ఈ ముఠా నకిలీ 2 బిహెచ్‌కె కేటాయింపు లేఖలను ఉపయోగించినట్లు, 170 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు లభించాయని ఒప్పించి, వారిలో ప్రతి ఒక్కరి నుండి రూ .1.5 లక్షల నుండి రూ .1.6 లక్షల వరకు డబ్బు తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..