హైదరాబాద్: తెలంగాణలో రోజూ వారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండటం అటు తెలంగాణ సర్కార్‌కి ఇటు కరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజానికానికి కొంత ఊరట కలిగిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 7కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 2కి పడిపోవడం గమనార్హం. సోమవారం నమోదైన ఆ రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోవేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం నేడు నమోదైన 2 కేసులు కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1003కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : 28 వేలు దాటి కరోనా కేసులు.. 900 చేరువలో మృతుల సంఖ్య


ఇవాళ 16 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 332  మందికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 646 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..