Woman Jumps into Godavari River With Two Children: ఏ కష్టం వచ్చిందో ఏమో ఆ తల్లికి ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుంది. నిర్మల్‌ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి నదిలోకి దూకి మృతి చెందగా.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. మృతులను నిజామాబాద్‌కు చెందిన మానస (27), ఆమె కొడుకు బాలాదిత్య (8), కూతురు నవ్యశ్రీ (7)‌లుగా పోలీసులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని వచ్చిన మానస.. నిజామాబాద్ నుంచి బాసరకు చేరుకుంది. గోదావరి బ్రిడ్జిపైకి వచ్చి ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీయించారు. నది వద్ద గంగా హారతి ఇచ్చే ఘాట్‌కు దగ్గరలో చిన్నారుల స్కూల్‌ బ్యాగులు, ఖాళీ చేసిన టిఫిన్‌ బాక్సులను పోలీసులను గుర్తించారు. తన పిల్లలకు అన్ మహిళ.. తరువాత వారితో కలిసి నదిలోకి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని అన్నారు. మృతురాలు  ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. 


Also Read: Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధం.. తొలిసారి పరేడ్‌లో ఆ విమానం  


Also Read: ICC Awards: ఐసీసీ టీ20 అత్యుత్తమ జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి చోటు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి