Corona Cases in Schools: దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాల్లో కరోనా కేసులు(Corona Cases in Schools) ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల(BC Gurukul School)లో కొవిడ్ కలకలం రేగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పటానుచెరు మండలంఇంద్రేశం గురుకులంలో 29 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.  మొత్తం 284 మంది విద్యార్థినులకు కొవిడ్ పరీక్షలు(Covid Tests) చేశారు. ఇందులో 29 మందికి వైరస్​ సోకింది. కేసులు పెరగడంతో..తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల మొత్తాన్ని శానిటైజ్‌ చేయిస్తున్నారు.


Also Read: Sangareddy: గురుకులంలో కరోనా కలకలం...43 మంది విద్యార్థులకు పాజిటివ్!


ఇటీవలె ముత్తంగి గురుకుల పాఠశాల(Muttangi Gurukul school)లో 43 మందికి వైరస్ సోకింది. అప్రమత్తమైన అధికారులు సోమవారం (నవంబర్​ 29)  మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లా(Khammam district)లోని వైరా గురుకుల పాఠశాల(gurukul school)లో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్(Covid-19 Positive)గా నిర్దారణ అయ్యింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook