తెలంగాణలో COVID-19 లేటెస్ట్ అప్డేట్స్
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది. సోమవారం 40 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు మొత్తం 585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 471 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 29మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఈ మేరకు సోమవారం రాత్రి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనావైరస్ వ్యాప్తిపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Also read : మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే
ఇదిలావుంటే, రాష్ట్రంలో కోవిడ్-19 నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందనే వివరాలపై ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగించాలా ? లేక సడలించాలా ? వైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వైఖరి అవలంభించాలి ? తదితర అంశాలను ఈ కేబినెట్ భేటీలోనే చర్చించి, ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో మంగళవారం నాడు జరిగే కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..