3 Omicron cases detected in Telangana: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ (Omicron).. తెలంగాణ (Telangana)లోకి కూడా ప్రవేశించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడేళ్ల చిన్నారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. ఒమిక్రాన్‌ సోకిన వీరు తాజాగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. ఒమిక్రాన్‌ సోకిన ఈ ముగ్గురు కెన్యా, సోమాలియా నుంచి వచ్చారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 12వ తేదీన కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ హైదరాబాద్  విమానాశ్రయానికి రాగా.. ఆమెకు నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్‌ అని తేలింది. ఆపై జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) డా. శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ టోలిచౌకిలో కెన్యాకు చెందిన మహిళను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. ఇక ఆ మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ కూడా సేకరించి పరీక్షలకు పంపామని ఆయన తెలిపారు. 


Also Read: అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?


సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్లు డీహెచ్‌ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. అతడిని టోలిచౌకిలో గుర్తించామని, మరికొద్ది గంటల్లో గుర్తించి టిమ్స్‌కు తరలిస్తామన్నారు. ఇక మూడో వ్యక్తి ఏడేళ్ల బాలుడట. అయితే అతడు రాష్ట్రంలోకి ప్రవేశించలేదని డీహెచ్‌ చెప్పారు. బాలుడు కుటుంబంతో కలసి విదేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చి.. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌కు  వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి బాలుడు వెళ్లే ముందు ఇచ్చిన శాంపిల్‌ను పరిశీలించగా అతడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలిందట. దాంతో ప్రస్తుతం తెలంగాణాలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. 


Also Read: Indian Railways Luggage Rules: రైలు ప్రయాణంలో లగేజ్ నిబంధనల గురించి తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి