Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం సంభవించి పక్క భవనానికి మంటలు వ్యాపించడంతో అందులో ఉంటున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో దంపతులు, వారి కుమారుడు ఉన్నారు. ఈ ఘటన కుషాయిగూడలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులను నరేశ్‌ (35), సుమ(28), జోషిత్‌(5)గా గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన వారిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Students Drown: విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి.. 


అసలేం జరిగిందంటే...
ఈరోజు తెల్లవారుజామున కుషాయిగూడలోనే టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు పక్కన ఉన్న భవనానికి వ్యాపించాయి. దీంతో అందులో ఉంటున్న భార్యభర్తలు సహా వారి చిన్న కుమారుడు మృతి చెందారు. బంధువుల ఇంట్లో నిద్రించిన పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి