Diwali celebrations in Hyderabad: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా దీపాల పండుగను జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీపావళి సంబరాలు (Diwali celebrations) అంబరాన్నింటాయి. అయితే టపాసులు కాల్చే టైంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణాలమీదకు తెస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలుచోట్ల పటాసులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మెుత్తం 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మందికి కంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో బాధితులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండటం విశేషం. 


ఆస్పత్రిలో జాయిన్ అయినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు. అందులోముగ్గురినీ వేరే ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. మరోవైపు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది వరకు గాయపడి వచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఫెస్టివల్ సందర్భంగా ఆస్పత్రిలో అదనపు వైద్య సిబ్బందిని ఉంచినట్లు సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు.


Also Read: Diwali Fire Crackers: చెబితే వినరు.. చేతులు, కళ్లు కాల్చుకుంటారు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి