హైదరాబాద్: తెలంగాణలో శనివారం నాడు కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఈ గణాంకాల ప్రకారం తాజాగా తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 272కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆస్పత్రులలో 228 మంది పాజిటివ్ కేసులకు కోవిడ్ చికిత్స అందిస్తున్నాం. కరోనా వ్యాధి నయమైన ఓ వ్యక్తిని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాం. అలా ఇప్పటివరకు మొత్తం 33 మందిని డిశ్చార్జ్ చేశామని మంత్రి ఈటల తాజా ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదైనా... వారికి అందరికీ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : కరోనా లక్షణాలతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. పారాసిటమోల్ ఇచ్చారు


తెలంగాణలో కరోనావైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని.. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్‌కి వెళ్లొచ్చిన వారు లేదా వారిని కలిసిన వారేనని మంత్రి స్పష్టంచేశారు. మర్కజ్ నుండి మన రాష్ట్రానికి మొత్తం 1090 మంది వచ్చారని.. వాళ్లందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన ప్రకటన ప్రకారం.. 6 ల్యాబ్స్ 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. గచ్చిబౌలిలో మరో రెండు రోజుల్లో 1500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.  


Read also : కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు


ప్రస్తుతం 5 లక్షల N95 మాస్కులు, 5 లక్షల పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్ (PPE kits), మరో 5 లక్షల వైరల్ ట్రాన్స్‌మిషన్ కిట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా 4 లక్షల కరోనా టెస్టింగ్ కిట్స్, 20 లక్షల సర్జికల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లోసెస్ కొనుగోలు చేసిపెట్టామని మంత్రి ఈటల వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..