Boy Died After Street Dogs Attacks: తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన మరువకముందే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పుటాని తండా గ్రామపంచాయతీలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. కుక్కల దాడిలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాండాకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు బానోతు  భరత్ (5). నెల రోజుల క్రితం ఇంటి ముందు భరత్ ఆడుకుంటుండగా.. వీధిలోని కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే కుక్కకాటును తల్లిదండ్రులు గమనించలేదు. బాలుడికి రేబిస్ వ్యాధి సోకడంతో పరిస్థితి విషమించింది. సోమవారం తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. సూర్యాపేట సమీపంలో బాలుడు మరణించాడు. 


బాలుడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన అంత్యక్రియలు పూర్తిచేశారు. చిన్నారి మరణంతో పుటాని తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో తిరుగుతున్న వీధి కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


ఇటీవలె హైదరాబాద్‌ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి మృతి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరి హృదయాలను కలచి వేసింది. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు చివరివరకు పోరాడి ప్రాణాలు కోల్పవడం కంటతడి పెట్టించింది. 


కాగా.. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలలో ఓ బాలికపై వీధి కుక్కలు రెండు దాడికి ప్రయత్నించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఆ బాలిక ప్రాణభయంతో కేకలు వేస్తూ ఒక్కసారిగా కేకలు పెట్టింది. అయినా కుక్కలు వదలకుండా బాలికను వెంటాడాయి. అయితే ఓ మెకానిక్ గమనించి వెంటనే బాలికను రక్షించాడు. కుక్కలను బాలికకు దూరంగా తరిమేశాడు. ఆ మెకానిక్‌పై నెట్టింట ప్రశంసల జల్లు కురిపించింది. 


Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం  


Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్‌ ఏర్పాటుకు కారణం ఆయనే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook