Telangana: తెలంగాణలో 1044 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న 22 మంది ఇవాళ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 464 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Also read : అప్పటివరకు విమానాలు, రైల్వే, మెట్రో సేవలు రద్దు
ఇప్పటివరకు తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 28 మంది మృతి చెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 552 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రి హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..