తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన 63 సంవత్సరాల రాథోడ్ రాందాస్ పదవ తరగతి పరీక్షలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే..  కొత్త పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం సర్పంచిగా పోటీ చేయాలంటే ఆ వ్యక్తి కనీసం పదో తరగతైనా పాసవ్వాలని గత కొద్ది నెలలుగా పలు వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఆ నిబంధనలు అమలులో లేవని తర్వాత ప్రభుత్వమే తెలిపింది.


అయినా కోకస్‌మన్నూర్‌ ప్రాంతానికి ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న రాందాస్ మాత్రం తాను కచ్చితంగా టెన్త్ పాస్ అవ్వాలి అని తీర్మానించుకున్నారు. ప్రజా ప్రతినిధులు కనీసం పదవ తరగతైనా చదవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తొలి ప్రయత్నంగా ఆ సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పాఠశాల ద్వారా మొదటిసారిగా తానే పదవి తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రంలో రాథోడ్ పదవ తరగతి పరీక్షలు రాశారు.