7 people dead in Bachupally wall collapsed: భారీ వర్షం విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. నిన్న మంగళవారం సాయంత్రం కురిసిన వానకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు రిటర్నింగ్‌ వాల్ కూలి 7 గురు కార్మికులు మృతి చెందారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ఇందులో ఒక మహిళ, చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా ఎండల వల్ల ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నిన్న కురిసిన వానలు కాస్త ఉపశమనాన్ని అందించాయి. కానీ, ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షభీభత్సం ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది అసువులుబాసారు. పలు ప్రాంతాల్లో హోర్డింగులు కూడా పడిపోయాయి.   రికార్డుస్థాయిలో నిన్న 14 సెంటి మీటర్ల వాన కూడా పలుప్రాంతాల్లో నమోదైంది.


వర్షభీభత్సానికి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మకాలనీలో నిర్మాణం చేపడుతున్న ఓ అపార్ట్‌మెంట్‌ గోడ కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తు్న కార్మికులు హిమాన్షు (4), గీత (32), తిరుపతి (20), రాజు (25), శంకర్ (22), రామ్‌ యాదవ్ (34) ఖుషిలు మృతి చెందారు. మృతులందరూ ఒడిశా, ఛత్తిస్‌గఢ్‌కు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయలు కూడా అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పోలీసుకులు జేసీబీ ద్వారా మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 


ఇదీ చదవండి: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు


నిన్న మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నా, సాయంత్రంలోగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వానలు దంచికొట్టాయి. దీంతో జీడిమెట్ల, బహదూర్‌పల్లి, అమీర్‌పేట, కూకట్‌పల్లి, జూబ్లిహీల్స్‌ తదితరల ప్రాంతాల్లో కుండపోత వర్షమే కురిసింది. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా కలిగాయి. ఈ వర్షాలు మరో నాలుగురోజులపాటు కూడా ఉండవచ్చని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. నగరప్రజలందరూ త్వరగా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని నిన్న 4 గంటల సమయంలో వాతావరణశాఖ సర్క్యూలర్‌ కూడా విడుదల చేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలెర్ట్‌ ప్రకటించింది. 


ఇదీ చదవండి: హైదరాబాద్‌లో గాలి, వాన బీభత్సం.. ట్రాఫిక్ జామ్


అంతేకాదు మ్యాన్‌హోల్స్‌, కరెంటు పోల్స్‌ దగ్గరకు వెళ్లకూడదని కూడా ఆ సర్క్యూలర్‌లో ప్రకటించింది. కానీ, ఎక్కువ ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రజలందరూ ఇళ్లకు చేరుకునే సమయంలోనే ఈ వర్షం భీభత్సాన్ని సృష్టించింది. ఈనేపథ్యంలో నిన్న కూరిసిన వర్షానికి అమీన్‌పూర్‌ చేరువు కూడా సముద్రాన్ని తలపించింది.కొన్ని ప్రాంతాల్లో చెట్లునేలవాలాయి. మరికొన్ని చోట్ల కరెంటు తీగలు కూడా తెగిపోయిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజులపాటు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ, వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook