తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, మంత్రులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జెండా వందనం అనంతరం పోలీసుల, సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు రాష్ట్ర వ్యాప్తంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాను ఎగురువేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాల్లో కూడా నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


కేసీఆర్ ప్రసంగంలోని హైలెట్స్


  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17వేల కోట్ల రుణాలు మాఫీ; 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం

  • రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే

  • రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సంకల్పించాం

  • సమైక రాష్ట్రంలో కుదేలైన రంగాలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వేగంగా పురోగమిస్తున్నాం

  • విత్తనాల, ఎరువుల సమస్యలను పరిష్కరించాం. పీడీ యాక్ట్ పరిధిలోకి తెచ్చాం

  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచాం

  • వృద్దులు, వితంతువులతో పాటు కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నాం. అలాగే వికలాంగులు, పేద వృద్ధ కళాకారులకు నెలకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తున్నాం