తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరు ? జేఈఎస్ సదస్సులో మహిళా సాధికారతపై మాట్లాడుతున్న కేసీఆర్ ఎదురైన ప్రశ్న ఇది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఏడుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వీరిలో ఒక్కరికీ మంత్రి ఇవ్వలేకపోయింది. ఈ అంశంపై గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. జేఈ సందస్సు వేదికపై ఈ అంశంపై ఎదురైన ప్రశ్న మంత్రి కేటీఆర్ కు ఇబ్బందికరంగా పరిగణించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాకచక్యంగా స్పందించిన కేటీఆర్..


మహిళా మంత్రి అంశంపై ఎదురైన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ చాకచక్యంగా స్పందించారు. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మంత్రి పదవుల విషయంలో సీఎం కేసీఆర్ సమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అలాగే చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలన్న వాదనకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే మహిళా బిల్లుకు తమ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ జీఈ సదస్సు వేదికగా హామీ ఇచ్చారు.