Suicide Video: ప్రేమ ప్రేమించాలి కానీ..చావు కోరకూడదు. తెచ్చుకోకూడదు. దురదృష్ఠవశాత్తూ ఇప్పటి ప్రేమలో అది లోపిస్తోంది. ఓ ప్రేమికుడు..కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్ళవుతున్న ప్రియురాలినీ చంపబోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ మరొకరి చావును కోరకూడదు. చావుని తెచ్చుకోకూడదు కూడా. ప్రేమ ఎప్పుడూ ప్రేమించాలి. ప్రేమను కాదంటే భరించే గుణముండాలి. ప్రేమ కోసం ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోగొట్టుకోవడం చేయకూడదు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో అదే జరిగింది. ఒళ్లు గగుర్పాటు కల్గించే ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వైరల్ అవుతోంది. 


లంగర్‌హోస్‌లో ఓ పెళ్లి జరుగుతోంది. ఆ వధువుని ప్రేమించిన ప్రియుడు మనస్థాపంతో పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. అంతటితో ఆగకుండా..అలాగే మండపంలో అందరు చూస్తుండగానే..వధువును హత్తుకున్నాడు.దాంతో అప్రమత్తమైన బంధువులు..వధువుని పక్కకు లాగేశారు. ప్రస్తుతం వధువు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతోంది. తీవ్రంగా కాలిన ప్రియుడు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డవడంతో వైరల్ అవుతోంది. ప్రియురాలి పెళ్లిలో ఆత్మహత్య చేసుకుని..ప్రియురాలినీ చంపబోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 


Also read: Pawan Kalyan: ప్రధాని మోడీ గారు మీతో కుదరదంతే..! భీమవరం సభ సాక్షిగా బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook