ఇంటికి పిలిచి తోబుట్టువులనే కడతేర్చిన ఉన్మాది
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
Hyderabad Man Killed His Sisters | ముగ్గురు అక్కలు, బావపై కత్తితో దాడి చేసిన ఉన్మాది .. ఇద్దరు మృతి
హైదరాబాద్ : ఓ ఉన్మాది (psycho) రెచ్చిపోయాడు. తన సొంత అక్కలనే (siblings) కడతీర్చేందుకు ముందస్తుగానే ప్రణాళిక రచించాడు. అమ్మకు బాగాలేదని ఇద్దరు అక్కలను రప్పించి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆతర్వాత మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన బావను కూడా కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా నాలుగో అక్కనూ చంపుదామనుకున్నాడు.. కానీ అక్కడ పోలీసులు ఉండటంతో పారిపోయాడు. ఈ ఉన్మాది ఘాతుకానికి ఇద్దరు తొబుట్టువులు కన్నుమూయగా.. మరో అక్క, బావ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన హైదారబాద్ నగరం పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ (Chandrayanagutta Police Station) పరిధిలోని బార్కస్ సలాలాలో సోమవారం జరిగింది. G4 Virus: చైనాను హడలెత్తిస్తున్న మరో ప్రాణాంతక వైరస్..
నగరంలోని సలాలాలో ఉన్మాది అహ్మద్ ఇస్మాయిల్ తల్లి పుత్లీబేగంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని వెంటనే రావాలని అక్కలకు కబురుపెట్టాడు. ఉదయం ఇంటికి వచ్చిన ఇద్దరు అక్కలు రజియాబేగం, జకీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు. ఆ తర్వాత కొంత దూరంలోనే నబీల్ కాలనీలో నివాసముంటున్న మూడో అక్క నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అడ్డుపడ్డ బావ ఉమర్‌పైనా దాడి చేసి పరారయ్యాడు. సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. అప్పటికే రజియా బేగం చనిపోగా.. కొనఊపిరితో ఉన్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జకీరాబేగం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, గతేడాది మార్చిలోనూ నిందితుడు తన భార్యను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఒక్క Tik Tokతోనే చైనాకు వంద కోట్ల నష్టం
నాలుగో అక్కనూ చంపాలనుకోని...
సమీపంలో ఉంటున్న నాలుగో అక్క మల్లికాబేగాన్ని కూడా ఇస్మాయిల్ చంపేందుకు వెళ్లాడు. అయితే దాడికి గురైన తన సోదరిని ఆసుపత్రిలో చేర్చారని తెలుసుకున్న ఆమె అప్పటికే ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ పోలీసులు ఉండటంతో పారిపోయాడు. గతంలో అక్కలు చెప్పడంతోనే గతంలో తన భార్యను చంపానని, ఇప్పుడు ప్రతీకారంగా వారిని చంపుతున్నాని దారిలో కనిపించిన ఓ బంధువుకు ఇస్మాయిల్ చెప్పాడని పలువురు పేర్కొంటున్నారు.
ఆస్తిపంపకాల కోసం ఆదివారం సమావేశం..
ఇదిలాఉంటే.. ఆదివారం ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు సమావేశమయ్యారని, ఆ తర్వాతే నిందితుడు హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలో ఇస్మాయిల్ బౌన్సర్‌గా పనిచేసేవాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో భయ వాతావరణం నెలకొంది.