ABVP Bandh in Telangana: నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ బంద్.. ABVP పిలుపు!
ABVP Called for Schools Bandh in Telangana: తెలంగాణలో సోమవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.
ABVP Called For Schools Bandh in Telangana: రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు వెంటనే బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ఎలక్షన్ ఫండింగ్‌లకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని సోమవారం పాఠశాలల బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా 15 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నాయని.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు టెక్ట్ బుక్స్, యూనిఫాం వెంటనే అందజేయాలన్నారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించి.. ఖాళీగా ఉన్న డీఎస్సీ, ఎంఈవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకున్నా నడిపిస్తున్నారని.. అలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి