Cops got suspended in Addaguduru lockup death case: యాదాద్రి భువనగిరి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో మూడు రోజుల క్రితం జరిగిన లాకప్ డెత్ కేసులో పోలీసులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. అడ్డగూడూరు ఎస్సై మహేష్, కానిస్టేబుల్ రషీద్, జనయ్యలను సస్పెండ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీచేశారు. అడ్డగూడురులో మరియమ్మ అనే 45 ఏళ్ల మహిళను ఓ చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె మూడు రోజుల క్రితం లాకప్‌లో చనిపోయారు. పోలీసుల వేధింపులు భరించలేకే మరియమ్మ చనిపోయిందంటూ గ్రామస్తులు అడ్డగూడూరు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో (Addaguduru lockup death case) పోలీసుల వైఖరిపై ఆరోపణలు రావడంతో మరియమ్మ మృతిపై కమిషనరేట్ స్థాయిలో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. రాచకొండ కమిషనరేట్ జరిపిన దర్యాప్తులో మరియమ్మ మృతి వెనుక ఎస్సై మహేష్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యల పాత్ర ఉన్నట్టు తేలడంతో ఎస్సై మహేష్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ (Rachakonda CP Mahesh Bhagawath) ఉత్తర్వులు జారీ చేశారు.


Also read : Rythu bandhu scheme money: పాత బకాయిల కింద రైతు బంధు.. స్పందించిన మంత్రి హరీష్ రావు, బ్యాంకులకు ఆదేశాలు


మల్కాజిగిరి ఏసీపీ ఆధ్వర్యంలో మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ (Mariyamma lockup death case investigation) జరిపించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 


Also read : TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook