Akbaruddin Owaisi: హైడ్రా కూల్చివేతలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఏఐఎంఐఎం సీనియర్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నిర్మాణాన్ని కూల్చోవద్దని.. దాని బదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపించాలని సవాల్‌ విసిరారు. తన నిర్మాణం కూల్చివేస్తారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ వరుసగా కూల్చివేతలు చేపడుతున్న నేపథ్యంలో అందరిలో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు చెందిన ఫాతిమా విద్యాసంస్థల భవనం కూల్చివేస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తన భవనం కూల్చివేయొద్దని విజ్ఞప్తి చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nagarjuna: నేను ఎలాంటి ఆక్రమణ చేయలేదు: కుండబద్దలు కొట్టిన నాగార్జున

'నన్ను బుల్లెట్లతో కాల్చండి. కానీ నా కళాశాలను కూల్చివేయొద్దు. విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందిస్తున్నానని కొందరు అసూయ పడుతున్నారు. నాతో శత్రుత్వం ఎవరైనా ఉంటే రండి తుపాకీలతో కాల్చి నన్ను చంపేయండి. కానీ నేను చేసే మంచి పనిని మాత్రం కూల్చవద్దు.. నాశనం చేయొద్దు' అని విజ్ఞప్తి చేశారు. తనపై గతంలో చాలా దాడులు జరిగాయని.. ఇది కొత్త కాదని పేర్కొన్నారు. 'కత్తులతో నాపై దాడి చేయండి. కానీ నా మంచి పనిని నాశనం చేయొద్దు' అని కోరారు.
 


Also Read: Nagarjuna Vs Revanth Reddy: నాగార్జునను... రేవంత్ అప్పుడే టార్గెట్ చేశారా..?


'నేను బతిమిలాడుతున్నానంటే నాకు శత్రువులతో పోరాడే శక్తి లేక కాదు. నాపై దాడి జరిగింది. నా శరీర భాగంలో అన్ని గాయాలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఒవైసీ శత్రువులకు వెన్ను చూపే వ్యక్తి కాదు' అని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. కత్తులు, బుల్లెట్లతో తనను మరోసారి దాడి చేయండి. అంతే కానీ నా కాలేజీని వదిలేయండి' అని అక్బరుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. పేదల విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అడ్డుకోకూడదని విన్నవించారు.


హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతలతో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మజ్లిస్‌ ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇప్పుడు అక్బర్‌కు సంబంధించిన కళాశాల భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేస్తుందని చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా అక్బరుద్దీన్‌ తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక జారీ చేసినట్లు కనిపిస్తోంది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter