మారణాయుధాలు అమ్ముతారా.. ఎంత ధైర్యం? అమెజాన్, స్నాప్‌డీల్ పై కేసులు
అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఆన్ లైన్ వెబ్‌సైట్ల ద్వారా కత్తులు, కటార్లు, చురకత్తులు, తల్వార్‌లను విక్రయించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.
అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఆన్ లైన్ వెబ్‌సైట్ల ద్వారా కత్తులు, కటార్లు, చురకత్తులు, తల్వార్‌లను విక్రయించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం 9 అంగుళాల పొడవు కంటే ఎక్కువుండే కత్తులు, డాగర్లను మాత్రం విక్రయించడం ఎక్కడైనా నిషేధమని పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు, తమ వెబ్ సైట్లలో వీటిని అమ్మేందుకు పర్మిషన్ ఇచ్చినందుకు అమెజాన్, స్నాప్‌డీల్ సంస్థలకు ఇప్పటికే నోటీసులు పంపించామని హైదరాబాద్ పోలీసు శాఖ తెలిపింది. ఈ మధ్యకాలంలో యువత వివిధ ఆకారాల్లో ఉన్న కత్తులను, డాగర్లను వెంటేసుకొని తిరగడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారని.. వాటిని ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో కొని, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు తీసి పెడుతున్నారని పోలీసులు అన్నారు.