ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగభరింతంగా ప్రసంగించారు. అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహించిన 'సమరభేరి'లో  భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాగ్దానాలు నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ పై  అమిత్ షా సంధించిన విమర్శనాస్త్రాలు : 
* దళితులకు సీఎం చేస్తామని కేసీఆర్ మోసం చేశారు.. మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ కూడా విస్మరించారు.
* లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు.. ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోయారు
*  పేదలకు 2 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పి 5 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేయలేదు.. కేంద్రం నిధులు కూడా ఉపయోగించలేదు
* కేసీఆర్ హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.. కేంద్రం ఇచ్చిన కోట్ల నిధులను దుర్వినియోగం 
* రైతులు ఆత్మహత్యకు కారణం కేసీఆర్ బాధ్యత వహించాలి..


ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేకపోయారని..ఏ వర్గానికి ఆయన సరైన న్యాయం చేయలేకపోయారని అమిత్ షా విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ను ఎందుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అభివృద్దిపథంలో నడిపించి చూపుతామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు


ఒకప్పుడు బీజేపీకి కరీంనగర్‌లో జిల్లాలో మంచి పట్టుండేది. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ వైభవాన్ని తిరిగి సాధించాలన్న బీజేపీ చీఫ్‌ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా అంతకుముందు మధ్యాహ్నం  బెగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా..నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆయా నియోజక వర్గాల బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నేరుగా కరీంనగర్‌ వచ్చారు