17th September 2022: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
Telangana Liberation Day 2022: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.
Telangana Liberation Day 2022: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపి నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా నగర శివార్లలోని శివరాంపల్లిలో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి బయలుదేరారు.
ఈ రాత్రికి నేషనల్ పోలీస్ అకాడమీలోనే బస చేయనున్న అమిత్ షా.. రేపు షెడ్యూల్ ప్రకారమే కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్న అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించనున్నారు. ఈటల రాజేందర్ తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చేందుకే అమిత్ షా ఈటల ఇంటికి వెళ్తున్నారు.
Also Read : BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?
Also Read : September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు
Also Read : Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి