తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. హైకమాండ్ తో కొట్లాడి తాము రాష్ట్రాన్ని సాధించామని వెల్లడించారు. తెలంగాణ తెచ్చింది మేమైతే..ఇచ్చింది సోనియమ్మ అని పేర్కొన్నారు.


తెలంగాణ ఇచ్చిన అమ్మను పట్టుకొని  బొమ్మ అంటున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అంజన్ కుమార్ హెచ్చరించారు. సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటే పుణ్యమైనా వస్తుందని కేటీఆర్ కు అంజన్ కుమార్ సలహా ఇచ్చారు. గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయల అవినీతికి కేటీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. అబద్ధాలతోనే సీఎం కేసీఆర్ గద్దెనెక్కారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడు అంజయన్ కుమార్ దుయ్యబట్టారు.