Srisailam Dam: మరో ప్రమాదం..జారిన కొండచరియలు
శ్రీశైలం డ్యాం వద్ద మరో ప్రమాదం జరిగింది. లెఫ్ట్ కెనాల్ అగ్నిప్రమాదం నుంచి కోలుకోకముందే డ్యాం ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవ్వరికీ ఏం కాలేదు.
శ్రీశైలం డ్యాం ( Srisailam Dam ) వద్ద మరో ప్రమాదం జరిగింది. లెఫ్ట్ కెనాల్ విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ( Left canal power plant fire accident ) నుంచి కోలుకోకముందే డ్యాం ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవ్వరికీ ఏం కాలేదు.
శ్రీశైలం డ్యాం రిజర్వాయర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. డ్యాం ప్రవేశ ద్వారం వద్ద కొండ చరియలు ( Land slide ) ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఎగువభాగం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లి కింద రోడ్డపై పడ్డాయి. రాత్రివేళ కావడంతో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలతో కొండ చరియలు జారిపడినట్టు తెలుస్తోంది. డ్యాం ఉద్యోగులు, పర్యాటకులు నిరంతరం రాకపోకలు సాగించే మార్గంలోనే ఈ కొండ చరియలు జారి పడ్డాయి. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగిన కొద్దిరోజులకే కొండ చరియలు జారి పడటంతో ఆందోళనకు లోనయ్యారంతా. అయితే ఎవ్వరికీ ఏం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కేవలం పదిరోజుల క్రితం అంటే ఆగస్టు 20 రాత్రి ఇదే శ్రీశైలం డ్యాం లెఫ్ట్ కెనాల్ పవర్ ప్లాంట్ ( Srisailam power plan ) లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి..దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న ఉద్యోగులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా కొండ చరియలు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జారిపడిన కొండచరియల్ని తొలగిస్తూ..చర్యలు తీసుకుంటున్నారు. Also read: KCR: జీఎస్టీపై ప్రధానికి కేసీఆర్ లేఖ