Honour Killing in Yadadri Bhuvanagiri: తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామకృష్ణ గౌడ్ అనే హోంగార్డు దారుణ హత్యకు గురయ్యాడు. అతని భార్య భార్గవి తండ్రి వెంకటేశ్ సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్‌తో రామకృష్ణను అంతమొందించినట్లు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం గుప్త నిధుల కేసులో సస్పెండ్ అయిన అతను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హోంగార్డుగా ఉన్న సమయంలో యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.


భార్గవి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినది కాగా.. రామకృష్ణ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో ఆగస్టు 16, 2020న భార్గవి-రామకృష్ణ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్దిరోజులు లింగరాజుపల్లిలో ఉన్న ఈ జంట... భార్గవి గర్భం దాల్చడంతో భువనగిరికి వచ్చి ఉంటున్నారు.


మరోవైపు, కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో భార్గవి తండ్రి ఆమె భర్తపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో అల్లుడు రామకృష్ణ గౌడ్‌ను చంపేందుకు లతీఫ్ అనే రౌడీ షీటర్‌కు సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రామకృష్ణ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటంతో.. అదే దారిలో వెళ్లి అతన్ని ట్రాప్ చేశారు. ముగ్గురు మహిళలతో ల్యాండ్ పేరిట అతనికి ఫోన్ చేయించారు. దీంతో ల్యాండ్ చూపించేందుకని రామకృష్ణ హైదరాబాద్ వెళ్లగా.. రౌడీ షీటర్ లతీఫ్ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. 


ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో అతని భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో రామకృష్ణ గౌడ్ మిస్సింగ్ విషాదాంతమైంది. కులాంతర వివాహమే రామకృష్ణ ప్రాణాలు బలితీసుకుందని... మామ వెంకటేశే అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 


Also Read: Prashant kishor: పీకేతో పరేషాన్.. రేవంత్ రెడ్డి శిబిరంలో టెన్షన్!


Flipkart TV Days: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్ టీవీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook