Another MIM Corporator rude behaviour with Cops: హైదరాబాద్‌లో మరో ఎంఐఎం కార్పోరేటర్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ హంగామా మరవకముందే... మరో ఎంఐఎం కార్పోరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు. పాతబస్తీలోని యునాని ఆసుపత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో స్థానిక ఎస్సైకి ఫిర్యాదు అందింది. దీంతో ఎస్సై అక్కడికి చేరుకోగా.. అక్కడే ఉన్న ఎంఐఎం కార్పోరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి ఎస్సైతో వాగ్వాదానికి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్సైని కార్పోరేటర్ ఖాద్రి ప్రశ్నించారు. ఇక్కడ మీ పవర్ చూపిస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఎస్సై చెప్పేది వినిపించుకోకుండా పదేపదే ఆయనపై బిగ్గరగా అరిచారు. అసలు మీకు ఫిర్యాదు చేసిందెవరంటూ ప్రశ్నించారు. యునాని ఆసుపత్రి గేట్లు తెరిపించి.. అక్కడి సిబ్బందిపై కూడా ఫైర్ అయ్యారు. ఎస్సైకి ఫిర్యాదు చేసిందెవరని... ఫిర్యాదు చేయనిదే ఆయన ఎందుకొస్తారని వారిపై మండిపడ్డారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి ఫోన్ చేయించి ఆమెతో మాట్లాడారు.


రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రార్థనల సందర్భంగా యునాని ఆసుపత్రిలోనే పార్కింగ్ కేటాయిస్తారని... గత 25 ఏళ్లుగా అది కొనసాగుతోందని సూపరింటెండెంట్‌తో చెప్పారు. మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు అలా జరగలేదన్నారు. ఇప్పటికైనా యునాని ఆసుపత్రిలో పార్కింగ్ వెసులుబాటు కల్పించాలని... తన లెటర్ ప్యాడ్‌పై వినతిపత్రం రాసిస్తానని సయ్యద్ ఖాద్రి సూపరింటెండెంట్‌తో పేర్కొన్నారు. 


కాగా, ప్రతీ ఏటా రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రార్థనల సందర్భంగా యునాని ఆసుపత్రిలో పార్కింగ్ స్థలం కేటాయిస్తారు. కానీ ఈసారి అధికారులు ఆ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రార్థనలకు వచ్చినవారు యునాని ఆసుపత్రి బయటే పార్కింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాహనాలు పార్క్ చేయడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనిపై ఎస్సైకి ఫిర్యాదు అందగా... వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కార్పోరేటర్ ఖాద్రి ఎస్సైతో వాగ్వాదానికి దిగడంతో... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: MIM Corporator Threatens Police: మరీ ఇంత అరాచకమా.. పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీ ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్


MIM Leaders Shocking Misbehaviour: ఎంఐఎం నేతలకు చట్టాలు వర్తించవా.. ఎంఐఎం నేతల ఆగడాలపై స్పెషల్ స్టోరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook