ED Filed ECIR On KTR: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీబీఐ కేసులో హైకోర్టు ఉత్తర్వులతో ఉపశమనం లభించిన కొన్ని గంటలకే ఈడీ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. త్వరలోనే ఈడీ నుంచి కేటీఆర్‌కు నోటీసులు అందనున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం


ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఎఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కూడా ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు మాదిరిగా ఈడీ కేసు ఉండడం ఆసక్తికరంగా మారింది.


Also Read: KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు పది రోజులు బ్రేక్‌


సీబీఐ నమోదు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కొన్ని కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసుపై ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా వేసింది. తీర్పుకు ముందు న్యాయస్థానంలో వాదనలు హోరాహోరీగా సాగాయి. కేటీఆర్‌ తరఫున ప్రఖ్యాత న్యాయవాది అర్యామా సుందరం వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రతివాదనలు వినిపించారు. 


కాగా ఈ కేసు వ్యవహరం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పార్టీగా వివాదం మారింది. చట్టసభల్లోనూ.. బహిరంగ చర్చల్లోనూ రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావుతో సహా ఆ పార్టీ అగ్ర నాయకత్వం స్పందించింది. న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంతో కాంగ్రెస్‌తో బీజేపీ జత కలిసి డ్రామాలు ఆడుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పని చేస్తున్నాయని మండిపడింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter