Pawan kalyan comments on janasena alliance with bjp in Telangana: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (జూన్ 29)  కొండగట్టు యాత్ర చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  పవన్ కళ్యాణ్ శామీర్ పేటలోని, తుర్కపల్లిలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్ గా  ఉంటుదన్నారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. ఏపీలో కూటమి, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలో.. పవన్ కొండగట్టు పర్యటనలో తాము.. తెలంగాణలోను బీజీపీతో కలిపి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. గతంలో తెలంగాణలో 8 స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగిన జనసేన, ఓటమి పాలైంది. కానీ బీజేపీ తాజాగా 2024 లో జరిగిన ఎన్నికలలో.. తెలంగాణాలో 8 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతే కాకుండా..వచ్చే ఎన్నికలలో ఆ స్థానాలను 88 లేదా అంతకన్న ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా పావులు కదుపుతుంది. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన అపోసిషన్ పార్టీ లా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దీనిలో భాగంగానే.. ఇప్పటికే కేంద్రం, తెలంగాణకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేసిందని చెప్పుకొవచ్చు.


ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. అదే విధంగా టీడీపీ గురించి పవన్ ఎలాంటి కామెంట్లు చేయలేదు.


Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
 


ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకొవడానికి వెళ్లారు. అంతేకాకుండా.. తెలంగాణలో గ్రేటర్ తోపాటు, పంచాయతీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో కలిసి, జనసేన బరిలో ఉంటుందా అనే దానిపై ఇప్పుడు చర్చనడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ..ఎలాగైన బీజేపీ పుంజుకుని తెలంగాణలో .. బలపడాలని బీజేపీ పావులు కదుపుతుంది.ఇక మరోవైపు ఏపీ మాదిరిగా మూడు పార్టీలు కలుస్తాయా.. లేదా కేవలం జనసేన, బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి