APJ Abdul Kalam Flyover: హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి చేరింది. విశ్వనగరంగా ఎదుగుతోన్న భాగ్యనగరంలో (Hyderabad) మరో ప్లైఓవర్ (Flyover) అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ (KTR) ఇవాళ ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్‌కు (APJ Abdul Kalam Flyover) ఆయన పేరును నామకరణం చేశారు. రూ.80 కోట్లు వెచ్చించి 12 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్‌ను నిర్మించారు.  దీంతో పాతబస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. ఈ కార్యక్రమంలో మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ఒవైసీ (MP Asaduddin Owaisi) పాల్గొన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కంచన్‌బాగ్‌లోని ఫిసల్‌బండ డీఆర్‌డీఎల్‌ వైపు నుంచి ఒవైసీ ఆసుపత్రి కూడలి మీదుగా బైరామల్‌గూడ వైపు వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్‌ (Flyover) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వంతెన నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలవనుంది. మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్‌ రింగ్‌రోడ్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ పైవంతెన ద్వారా చాంద్రాయణగుట్ట, కర్మాన్‌ఘాట్‌ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ ఫ్లైఓవర్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Electricity charges : తెలంగాణలో త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి