కాంగ్రెస్ మేనిఫెస్టో పై అరుణ్ జైట్లీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ రిలీజే చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం దేశ ప్రజలు లేరని అరుణ్ జైట్లీ ఎద్దేవ చేశారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ను జనాలను నమ్మరని అరుణ్ జైట్లీ విమర్శించారు. నగదు బదిలీ పేరుతో జనాలను మభ్యపెట్టాలని చూస్తోందని జైట్లీ విమర్శించారు.
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ, కేంద్ర సాయుధ బలగాలను తగ్గిస్తామంటోంది.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షిస్తామని చెబుతోంది ...ఇవి ప్రమాదకరమైన చర్యలని అరుణ్ జైట్లీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్ ఇప్పటికీ విభజన వాదుల చేతుల్లో ఉందని ..ఇప్పుడు కాంగ్రెస్ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి సవరణలు చేయడం చాలా ప్రమాదకరం అని జైట్లీ హెచ్చరించారు.