కాంగ్రెస్ అభ్యర్థి అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారన్న ఓవైసీ !
కాంగ్రెస్ అభ్యర్థిపై అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్ధరాత్రి ఓటర్లకు లంచం ఇవ్వజూపే ప్రయత్నం చేశారని ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈమేరకు ఓ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఖాయమని, ఆ అల్లానే అతడిని ఓడిస్తాడని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.