Blast at scrap godown in Hyderabad: హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు (Blast in Hyderabad) సంభవించింది. ప్లాస్టిక్ స్క్రాప్‌ను తుక్కు చేసే మెషీన్‌లో పాత ప్లాస్టిక్ డబ్బాను వేయగా.. అది ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరినీ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా గోడౌన్ గోడలు కూడా కూలినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గౌడౌన్ (Scrap Godown) ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ స్క్రాప్‌ను తుక్కు చేసి.. ఆ తుక్కును మళ్లీ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ క్రమంలో శనివారం (డిసెంబర్ 18) స్క్రాప్ మెషీన్‌లో పాత ప్లాస్టిక్ వస్తువులను వేయగా... అందులో ఓ డబ్బా ఒక్కసారిగా పేలింది. దీంతో మెషీన్ వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి గోడౌన్ గోడలు కూడా కూలిపోయాయి. ఆ ప్లాస్టిక్ డబ్బా మూత తీయకుండా మెషీన్‌లో వేయడం... అందులో కెమికల్ ఉండటం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.


ఈ పేలుడు ఘటనపై షేట్ బషీరాబాద్ (Hyderabad) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత డబ్బాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ గోడౌన్ నిర్వాహకులకు చెప్పారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. స్క్రాప్ ఏరుకునే ఓ వ్యక్తి.. చెత్త కుప్పపై ఉన్న ఓ ప్లాస్టిక్ డబ్బాను సేకరించి దాని మూత తీయబోయాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.


Also Read: Covid 19: ఒకే స్కూల్లో 18 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook