Attack on BJP MP: హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ హన్మకొండలో ఆదివారం జరిగిన బీజేపీ(BJP) నాయకుల సమావేశానికి ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్వింద్ సీఎం కేసీఆర్, వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆయన బయటకు బీజేపీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు పక్కనే ఉన్న బీజేపీ కార్యాలయంలోకి వెళ్లడానికి  ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుంది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోని స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరడంతో వారిని కూడా పోలీసులు అడ్డుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Also read: Sharad Pawar: పాక్ కాదు..చైనానే అసలు శత్రువు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిగ్గుచేటు: ఎంపీ అర్వింద్
ఈ విషయంపై ఎంపీ అర్వింద్ ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్‌లో జరిగిన ఆత్మనిర్భర్ భారత్ (atmanirbhar bharat) సమావేశానికి తాను హాజరై వెళ్తున్న క్రమంలో.. టీఆర్ఎస్‌లోని హిందూ వ్యతిరేక మూకలు తనపై దాడికి దిగాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక ఎంపీపై ఇలా దాడికి పాల్పడడం సీఎం, హోంమంత్రి, డీజీపీకి సిగ్గు చేటని విమర్శించారు.


Anti- Hindu forces in TRS attacked me in Warangal, Telangana, where I visited to address a press conference on ‘Aatma Nirbhar Bharat Abhiyan’.

They also chased my vehicle on the highway to Hyderabad. pic.twitter.com/fSnH9ke1in



ఇదిలాఉంటే.. ఎంపీ అర్వింద్‌పై దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar), ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి డీకే అరుణ ఖండించారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తుందని, పోలీసుల సమక్షంలో దాడులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. Also read: Rajasthan: సంక్షోభంలో గెహ్లాట్ ప్రభుత్వం