Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మెయిన్ వికెట్ అవుట్.. తెలంగాణలో కలకలం
Sarath Chandra Reddy Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెద్ద వ్యాపారలను ఈడీ అరెస్ట్ చేసింది.
Sarath Chandra Reddy Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మద్యం వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ ఇద్దరు పెద్ద వ్యాపారులకు సంబంధం ఉందని ఈడీ వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డి, వినోయ్ బాబుకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని తెలిపింది.
అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. సెప్టెంబర్ 21,22,23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్ లో సీబీఐ చేర్చింది. అప్పుడే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసికి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు గుర్తించారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ ఆఫీస్‌పై ఈడీ అధికారులు దాడులు చేశారు. 11 గంటల పాటుగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ ఆఫీస్‌పై కూడా దాడులు నిర్వహించారు.
Also Read: IND vs ENG Matches: ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచుల్లో ఎవరు ఎక్కువ గెలిచారో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook