హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకమందే..కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద షాక్ తలిగేలా ఉంది. ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ లో జంప్ అవుతున్నారని మీడియాలో కథనాలు ప్రసారమౌతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం మరో రెండు రోజుల్లో అజారుద్దీన్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని టాక్. ఇటీవలికాలంలో ఓ పెళ్లి విందులో హాజరైన అజారుద్దీన్ టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ హామీతో టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి


కారణం ఇదేనా ?
క్రికెటర్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన అజహరుద్దీన్.. 2009లో కాంగ్రెస్ లో చేరి యూపీలోని మురాదాబాద్ లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన అజహర్..2014లో ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆ తర్వాతి కాలంలో  కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేసింది. కాగా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అజహర్ ను పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోంది. దీంతో భవిష్యత్తు కోసం అజహర్ పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అజహరుద్దీన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లో ఉంటారా..లేదా గుబ్ బై చెప్పి గులాబీ కండువ కప్పుకుంటారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుత అంశంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారింది