తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ తరఫున తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అలాగే పార్టీ నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలోనూ పాల్గొననున్నారు. సత్తుపల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
చంద్రబాబునే గెలిపించండి: హీరో సుమన్
ఏపీలో అభివృద్ధి ఆగకూడదనుకుంటే మళ్ళీ చంద్రబాబునాయుడినే గెలిపించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన దృష్టి అంతా తెలంగాణపైనే ఉందని.. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. కేసీఆర్ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అటు జనసేనాని పవన్‌లా ప్రశ్నించే వాళ్లు రాజకీయాల్లోకి రావాలని హీరో సుమన్ అన్నారు.