Bandi sanjay climb Palm tree: గులాంబ గద్వాల జిల్లాలో (Jogulamba Gadwala district) బండి సంజయ్‌ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. రెండో విడత ప్రజా సంగ్రామయాత్రలో ఈ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. పాదయాత్ర ముందుకు సాగుతున్న క్రమంలో ఓ చోట ఇలా ఈతచెట్టు ఎక్కారు బండి సంజయ్‌. అయితే, పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్లను, స్థానికులను ఈ దృశ్యం ఆకట్టుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. గౌడన్న మాదిరిగా ఈత చెట్టుకు నిచ్చెన వేసి చెట్టు ఎక్కారు. అయితే, అప్పటికే గౌడన్న ఆ చెట్టుకు ఉన్న కల్లు కుండ దింపేశాడు. దీంతో, ఈతచెట్టుకు కల్లుగీసే తీరును సంజయ్‌ పరిశీలించారు. ఈతచెట్టు దిగిన తర్వాత ఆ చెట్టు నుంచి తీసిన కల్లుకుండను గౌడ కులస్తులు బండి సంజయ్‌కి చూపించారు. కల్లు తాగాలని కోరారు. కానీ, బండి సంజయ్‌ సున్నితంగా తిరస్కరించి అక్కడినుంచి వెళ్లిపోయారు. 


Also Read: Hanuman Jayanti Procession: హనుమాన్ శోభాయాత్ర షెడ్యూల్‌...ట్రాఫిక్‌ ఆంక్షలు అక్కడే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook