9 Years Of PM Modi: మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. 9yearsofseva.bjp.org పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్... మోదీ ప్రభుత్వానికి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు పలకాలి అని కోరుతూ 9090902024 నెంబర్ ను విడుదల చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై 30 రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదల చేసిన బండి సంజయ్.. జూన్ 1 నుండి 7 వరకు పార్లమెంట్ వారీగా మీడియా సమావేశాలు నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వికాస్ తీర్థ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి  ప్రాజెక్టులను జాతీయ, స్థానిక నేతలు సందర్శించాలి అని కోరారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో కేంద్ర మంత్రి లేదా జాతీయ నాయకులు వస్తున్నారు అని వెల్లడించిన బండి సంజయ్.. జూన్ 8 నుండి 14 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జన సంఘ్ నుండి నేటి బీజేపీ దాకా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకుల, మేధావులతో సమ్మేళనం నిర్వహించాలి అని సూచించారు.


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మోర్చాల సంయుక్త సమ్మేళనం నిర్వహించాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులతో అత్మీయ సమావేశం నిర్వహించాలి. జూన్ 15 నుండి 21 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి అని బండి సంజయ్ తెలంగాణ బీజేపి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న అన్ని మండలాల్లో ఘనంగా యోగా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలి అని స్పష్టంచేశారు.


జూన్ 22 నుండి 28 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు జరిపి, ఆ తరువాత గడప గడపకు బీజేపీ పేరుతో ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలపై విస్త్రత ప్రచారం నిర్వహించాలి అని అన్నారు. జూన్ 23న ప్రతి పోలింగ్ బూత్ లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ కార్యక్రమాలు అందరికీ తెలిసేలా చేయాలి. జూన్ 25న ప్రతి పోలింగ్ బూత్ లో ‘‘మన్ కీ బాత్’’ నిర్వహించాలి అని బండి సంజయ్ స్పష్టంచేశారు.