Karimnagar: బండి సంజయ్ భారీ వ్యూహం.. కరీంనగర్‌లో 28న అమిత్ షా సమావేశం
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
BJP Meet in Karimnagar: మరోసారి కరీంనగర్ ఎంపీగా గెలవడంపై బండి సంజయ్ కుమార్ కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని బదులు తీర్చుకునేలా సంజయ్ వ్యూహం రచిస్తున్నారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్‌లో ఓ భారీ సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ కార్యకర్తలతో ఈనెల 28న ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేలాది కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర కళాశాల మైదానంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 20 మంది కార్యకర్తలను ఆహ్వానిస్తున్నట్లు, లోక్‌సభ నియోజకవర్గ వ్యాపంగా వేలాది మంది కార్యకర్తలు హాజరవుతారని వివరించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సమావేశానికి భారీ ఏర్పాట్లు
ఈ సమావేశం నిర్వహణపై బుధవారం కరీంనగర్‌లోని అశోక్‌నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద సంజయ్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అమిత్ షా పర్యటన, కార్యకర్తల సమ్మేళనానికి చేయాల్సిన ఏర్పాట్లు, రవాణా, ఇతరత్రా పనులపై చర్చించారు. అమిత్ షా రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ నగరాన్ని కాషాయమయం చేయాలని చెప్పారు. ‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్ నుంచి 20 మంది చొప్పున 40 వేల మంది క్రియాశీల కార్యకర్తలను ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం. సమ్మేళనానికి వచ్చేవారికి అన్ని సదుపాయాలకు కల్పించాలి. అమిత్ షా వేలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తారు’ అని బండి సంజయ్ తెలిపారు.
ప్రత్యేక వ్యూహం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై మరోసారి సత్తా చాటాలని బండి సంజయ్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని లోపాలను విశ్లేషించుకున్నారు. వాటిని సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ చరిష్మాను వినియోగించుకుని.. హిందూత్వ ఓట్లపై నమ్మకంతో సంజయ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించి గెలవగా.. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతున్నది. రెండు పార్టీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు.
Also Read: MLA vs Chiarperson: ఎమ్మెల్యే దాదాగిరిపై తిరగబడ్డ మహిళా చైర్మన్.. 'ఎమ్మెల్యే చెప్తే లేచి నిలబడాల్న?
Also Read: JanaSena Party: జనసేనకు డబుల్ బొనాంజా.. జానీ మాస్టర్, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook